3, నవంబర్ 2010, బుధవారం

మా అక్క టెన్త్ పరిక్షలు తప్పడం

హాయ్ , 
ఈ రోజు నేను బ్లాగాబొయేది ఏమిటో తెలుసా  ! !............? 
ఎలా తెలుస్తుంది నేను ఇంకా నేను బ్లాగలేదు కదా !
ఓకే ఓకే ఈ రోజు నేను మా అక్క టెన్త్ పరిక్షలు తప్పడం ఇంకా చాలా విషయాలు . 
అక్క కు టెన్త్ పరిక్షలు అందులో మా అక్క కు  మొదటినుండి లెక్కలు అంటే చాలా బయం అందులో ఆ మర్నాడు లెక్కల పరీక్షా ! సాయంత్రం అక్క నాకు అన్నం తిని పించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్న సమయం లో నేను తినకుండా కాసేపు అడుకుని , కాసేపు కడుపులో నొప్పి అని నటించి చివరాకరిగా ఏడుపు లంకిన్చుకునాను ఇంకఎముంది మనం ఇంటిలో మనం మహా రాజులం కదా అందుకని మా నాన్న గారు " కిష్టయ్య  ఎందుకు  ఎడుస్తునాడు " ఇంకా ఏముంది ఇంటిలో గొడవ మొదలు నాన్నగారు అందరినీ తిట్టారు , ఇంకేముంది అక్క సీరియస్ ఐంది సో   
నాన్నగారు : ఎందుకు వాడిని తిడుతునావ్ , ఎడిపిస్తునావ్ ,.
అక్క  : వాడు ఏడిస్తే నేను ఏం చేయను ?
నాన్నగారు : సముదైంచు . 
అక్క : నావల్ల కాదు , ఐన వాడు ఈ రోజు తిండి తినక పొతే ఏమవుతుంది .
నాన్న గారు : ఏమవుతుంది నువ్వు తినకు . 


ఇపాయింది  ఈ గొడవలో నేను పడుకున్దిపోయాను , ఫలితం రాత్రింకి నేను మల్లి లేవడం అక్క నాకు పెరుగు అన్నం విత్ బంగాలదుంపల కుర ...........! 
ఫలితం అక్క పరీక్షా తప్పింది 
ఫలితం మా ఊరిలో అందరు బయపడే హనుమంతరావ్ గారి దగ్గరకి రెండు నెలలు క్లాస్స్లకి  వెళ్ళవలసి వచింది 
ఫలితం అక్క సెప్టెంబర్ లో పరీక్షా పాస్ ఇంది.
****************************************************
మోరల్ : పరీక్షా ముందు రోజు ఇంటిలో గొడవ పడకూడదు , నా లాంటి చిన్న పిల్లలు పరీక్షా ముందు రోజు ఏడవకూడదు ! 
****************************************************
నా గురించి :
---------------------------------------------------------------------------------
అది 1985వ సంవత్సరం. మా అమ్మా, నాన్నలకు చివరి  కొడూకుగా జన్మించా. పుట్టగానే కళ్ళు తెరవలేదని నర్స్ పిర్ర మీద ఒక్కటేసింది. నాకు బాగా నొప్పొచ్చి 'అమ్మా' అని ఏడిచా.  
చాలా మంది నేను పుట్టగానే నాజాతకం చూసి వారసుడు, వంశోర్ధారకుడు, అదృష్టవంతుడు. ఒక్కమగాడు, బాలకృష్ణ, పెర ట్లో మొక్క అని అన్నారట !
             ఆ రోజు నాకు బారసాల. నాకు పేరేంపెడతారబ్బా అని నేను మా అమ్మ ఒళ్ళో పడుకుని నోట్లోవేసుకుని అందరివంకా చూస్తున్నా. ఇంతలో పంతులుగారు ఏవండి  శర్మ గారు అబ్బాయి పేరేమనుకుంటున్నారు ? అన్నారు. మా నాన్న 'కిష్టయ్య ' అన్నారు .కిష్టయ్య  బానే ఉంది ఈ పేరనుకునేలోపు మా అమ్మ అదేంటండి ఒట్టి కిష్టయ్య అని మా నాన్న గారి పేరు  బావుంటుంది అని 'రామ కృష్ణ ' అని మార్చింది మా నాన్న గారి ఓకే సూపర్ అన్నారు ఇంతలో పంతులుగారు శర్మ గారి పిల్లాడు శర్మ కాకపోతే ఎలా అని అది కూడా కలిపారు ఇంకేముంది మనపేరు రామకృష్ణ శర్మ ఇపాయింది . 
..............................................................................................................
నా కధలు షేర్ చేసుకొనే మేకు 
మీ 
కిష్టయ్య .

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి