4, మే 2011, బుధవారం

చెప్పాగా మా పరిస్థితి చెప్తే చరిత్ర వింటే వింతని మీ కిష్టయ్య .

మొన్నీ మధ్య పాపర్ లో చదివా ఎవరో ఇనప ముక్కలు, రాళ్ళు, గాజు పెంకులు గట్రా గులాబ్ జాములాగా లాగిస్తున్నడన్న వార్త ప్రపంచ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందేమొ కాని మా కాలేజి వాళ్ళను మాత్రం కాదు. దానికి కారణం కోకోల్లలు అని కవర్ చేయను. దానికి కారణం మా కాలేజి కాంటీన్. ఎంతటి వారనన్నాతలదన్నేవారున్నరంటారు, కానీ అందరిని తన్నేది మాత్రం మా కాలేజ్ కాంటీన్ అని గర్వంగా చెప్పుకుంటాను(ము).


********


అది నేను కాలేజ్ చేరిన కొత్తల్లో, అవి రాగింగ్ రోజులు, సీనియర్ లు అలా ఇలా అని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం నన్నూ పట్టుకున్నారు మా సీనియర్స్


"రేపు పొద్దున్నే తొరగా వచ్చేయ్ కాంటీన్ లో టిఫిన్ చేద్దుగానివి” అన్నాడొక సీనియర్. ఎలాగో రేపొద్దున సీనియర్స్ కాంటీన్ లో టిఫిన్ అన్నరుగా ఈ రొజు తినకుండా రేపు కుమ్మేదామ్ అనుకుని మరుసటి రోజు ఏడింటికల్లా కాంటీన్ కి చేరుకున్నా…


ఇక తిన్నాను చూడండి రాత్రి కూడ అన్నం తినలేదు కదా వరద బాధితులకు విందు భోజనం అందించినట్లు తిన్నాను. ధాంక్స్ అన్నయ్యలూ మీరు చాలా మంచి వాళ్ళు, సీనియర్స్ అంటే మీలా ఉండాలి అని పోసులిచ్చి క్లాస్ కి చేరుకున్నా. అప్పటికి బానేవుంది. మూడవ పిరిడ్ నుండి మొదలైంది అసలు కధ. అదో వింత బాధ, కూర్చోనీయదు, నుంచోనీయదు, నా బాధ ఇది అని ఎవరికి చెప్పుకోలేను, ఎంతో చెప్పుకోవలనిపిస్తున్నా ఏమి చెప్పుకోలేను. ఎవరికి చెప్పినా ఏమి చేయలేని పరిస్ఠితి, ఆ సమయములో నన్ను అర్థమ్ చేసుకునేది కేవలం ఆ బాధను అనుభవించిన వాళ్ళు మాత్రమే. ఇంతలో మా సినియర్స్ వచ్చి అంతా కూల్ చేసారు, రాగింగ్ కేసు కింద పోలిసులకు కంప్లియంట్ చేయద్దని బతిమిలాడారు, మనమూ కాంప్రిమైస్ అయిపోయామ్ అప్పుడు...


**********


మా పరిస్థితి చెపితే చరిత్ర వింటే వింత. అయినా నాకో విషయం అర్థం కాదు కానీ ఈ కాలేజ్ లో స్టాఫ్ బావుంది, ఫర్నిత్యర్ బావుంది, గోడలు బావున్నై, గడ్డి బావుంది, బూజు బావుందంది అని ఆలోచించే వారు ఈ కాలేజ్ కాంటీన్ గురించి ఆలోచించరా???


ఇక మా కాంటీన్ మెను లోకి మీరు తొంగిచూస్తే


-----------టిఫిన్---------------


1. రాళ్ళు ( బజ్జిలూ )
2. రబ్బర్లు ( పూరీలు)
3. ఇనప ముక్కలు ( ఇడ్లి )
4. గోధుమ పిండి ( చపాతి )


----------------------------------


మీల్స్(మొన్నటివి అయితే)
స్పెషల్ మీల్స్ (నిన్నటివి అయితే)


--------------------------------




ఎంతో ధర్యవంతులైతెనో, కొత్త వాళ్ళైతేనో, తప్పకనో తప్ప మా కాలేజ్ కాంటీన్ లో తినటానికి ఎవరూ సాహసించరు, ఒకవేళ తింటే మిగతావాళ్ళు ప్రసవం అయిన అమ్మయిని చూసుకున్నట్టు చూసుకుంటారు, మధ్య మధ్య లో కొబ్బరినీళ్ళు , విసిన కర్ర తో విసురుతూ, వాడు బాత్రూమ్ దాక వెళితే తోడు వెళుతూ, వాడి నోట్స్ పక్కన వాడు రాస్తూ,సాయంత్రం ఎవరన్నా బండి మీద వాళ్ళ ఇంటి దగ్గర దించి, పళ్ళు కొనిచ్చి, జాగ్రత్తలు చెప్పి మరీ వస్తారు, ఈ బాల్యోపచారాలు చూసి సార్ కూడ ఏమీ అనరు, అక్క డ అనుభవం అరవనీయకుండా చేస్తుంది, కష్టం అందరికి కామన్ కదా
సీనియర్స్ అయిన తర్వాత మేము ఓ రిజిష్టర్ మేంటేన్ చేసాము, ఎవరెవరు ( జూనియర్స్ ) రాగింగ్ లో భాగంగా కాంటీన్లో తిన్నరో తెలుసుకోటానికి ,బఫే లో లాగా నేను అందరికి తిఫిన్ ఇస్తుంటే మా రామ్ గాడు మందులు, కాంత్ గాడు పళ్ళు, కొందరు  గేట్ దగ్గర ఆటో మాట్లాడి పంపించా ట మ్ ఇలా Freshers party చేసామ్. ఇలా తరతరాలకు మా నిధి ని చేకూరేటట్టు చూశామ్. ఇలా అన్నా మా కాంటీన్ కు నిధులు చేకూరాయని మమ్మల్ని కేంద్ర ప్రభుత్వమ్ సత్కరించింది కూ డా.


మర్చిపోయా అప్పుడు నేను రాగింగ్ లో భాగంగా టిఫిన్ కోటుంటుoటే పొరపాటున నోరు జారి


“రాళ్ళు ఓ రెండు ప్లేట్లు ఇవ్వండి”, అనేసా


ఏమన్నా అవుతుందేమొ అని కంగారు పడ్డా దానికి కాంటిన్ వాళ్ళు


"ఓహో ! మీ బాచ్ వాళ్ళు బజ్జీలకు రాళ్ళని పెట్టారా, మరి @#$%^ అని పేరుపెట్టింది ఏ బాచ్ వాళ్ళు",అని నన్నూ అడిగేటప్పటికి నాకు !@#~# అనే రోగం వచ్చినంత పనైంది.




ఇలా కాదని ఇప్పటికీ పావలా కార్డు మీద ఉత్తరాలు రాసే మా సుధీర్ గాడితో ప్రిసిపల్ కి రాత పూర్వకంగా ఉత్తరం రాయించామ్ , వాడు లెటర్ క్రింద


"బంధుమిత్రుల అభినందనలతో” అని రాసినా దయాహృదుడైన మా ప్రిన్సిపల్ కాంటీన్ బయట ఓ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసారు.
****************


సీన్ కట్ చేస్తే అందరం కాంటీన్ లో తింటున్నము .


ఇంతలో మా రామ్ గాడు
"సుజాతా నువ్వు రాసిన కంప్లైంట్ పాపరు నా దగ్గరకు వచ్చిందోచ్" అని అరవటంతో అందరూ పరుగోపరుగు ...
తరవాత సుజాత వచ్చి శ్రీరామ్ బుర్ర బద్దలు కొట్టింది, అది వేరే సంగతంకోండి.


****************


నాలాంటి వాళ్ళు కాలేజ్ కి రాకపోవటమ్, ఏదో సాకు చెప్పి attendance అడిగేయటం మామూలే. ఈ సర్ పేరు సత్య కల్యాణ్ పరమ strict ఆయన caption కూడా అదే,attendance అడుగుదామని ఆయన గది లోకి అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళా, ఆయనను చూడగానే చెమటలు పట్టేశాయ్,


"ఏంటి attendance ఆ, వెయ్యను కాక వెయ్యను.


!@#$#%^$%&^(*)


అయినా ఏమైంది నీకు ....",అని అడగగానే
LKG నుండీ  అలవటున్న ఓ అబద్దమ్ Fever అని automatic గ్గా వచ్చేసింది నోటినుండీ, కొసమెరుపుగా కాంటీన్ లొ మొన్న భోజనము చేసాక....


వెంటనే సర్ కళ్ళ జోడు తీసి


"ఏంటీ...Oh!! I can understand your problem, How is your health, take care, I will do the rest of the thing “


అని attendance వేసారు.


**********


ఇంకా మా కాలేజ్ లో చెప్పవలసింది "టీ"గురించి, ఓ టీ ఇవ్వండి అనగానే కప్పుతో వేడి నీళ్ళు ముంచి ఇస్తారు,


ఈ టీ లొ రంగు లేదు,
రంగుంటే రుచి లేదు,
రుచింటే చిక్కదనం లేదు ,


ఆ టీ ఏ టీ అనుకున్నారు అది మాదే


చందన బ్రదర్స్ వాడి శ్రావణ మాసపు డిస్కౌంట్లు మా కాలేజ్ లోనూ ఉన్నయి బిర్యానీలు, గుడ్లు, అప్పుడప్పుడు నిజమైన టీ లు ఇలా ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చినా కాంటీన్ లోలాగా పప్పులు మా వాళ్ళ దగ్గరా ఉడకలా…




ఇక మా పిచ్చోడు కాంత్ గాడు  20 కేజీలే ఉంటాడు, వీడిది ఒంగోలు, తప్పక తప్పక తింటున్నాడు కాంటీన్ లో,


చెప్పాగా మా పరిస్థితి చెప్తే చరిత్ర వింటే వింతని
మీ కిష్టయ్య .
 ***************************************************************************
చివరగా ::


నిజంగా మీరు బరువును తగ్గించుకొవాలనుకుంటున్నారా?????
మా కాంటీన్ బ్రాంచీలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి…
ఓ సారి ట్రైల్ వేయండి మరి...  !.............................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి